Prashanth Realtor
August 1, 2024
దేశ అభివృద్ధి వేగవంతం కావడంతో కొత్త నగరాలు సృష్టి, అభివృద్ధి వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఇప్పటికే ఉన్న మెట్రోపాలిటన్ నగరాలతో పాటు కొత్త నగరాలు కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెరుగుదల చూపుతున్నాయి.
“రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి కొత్త నగరాలను ఎంచుకోవడం మంచి యుక్తి. ఐతే, పెట్టుబడి పెట్టే ముందు ఆ ప్రాంతంలోని మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ మరియు ప్రాపర్టీ విలువలు పైన సమగ్ర పరిశోధన చేయడం అనివార్యం. ఇవే కాదు, ఫ్యూచర్ గ్రోత్ సిటీస్ (Future Growth Cities) లో డిజిటలైజేషన్, టూరిజం, ఆఫీస్ స్పేస్‌లు వంటి రంగాల్లో ఉన్న అవకాశాలను పరిశీలించడం మంచిది. తెలుగు రాష్ట్రాలలో విశాఖపట్నం, తిరుపతి, అమరావతి లాంటి నగరాలు త్వరలో మంచి పెట్టుబడి అవకాశాలు కలిగిన నగరాలుగా మారుతాయి.”
2050 నాటికి భారతదేశం ఎనిమిది మెగా-సిటీలతో పాటు దాదాపు 100 నగరాలను కలిగి ఉంటుంది. మెరుగైన కనెక్టివిటీ, తయారీ కార్యకలాపాలు, హైబ్రిడ్ వర్క్ మోడల్స్ చిన్న నగరాల్లో ఆఫీస్ స్పేస్‌లకు డిమాండ్‌ను పెంచుతున్నాయి.
తిరుమల వెంకన్న సన్నిధి కారణంగా టెంపుల్ టూరిజంలో తిరుపతి నగరం మరింత అభివృద్ధి చెందుతోంది.
నవ్యాంధ్రలో విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రస్తుత ప్రభుత్వం చూస్తోంది. ఇక్కడ రియల్టీ పెట్టుబడులు పెరగడం, అభివృద్ధి చెందుతున్నట్టు కనిపిస్తుంది.
కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం అమరావతిని పెట్టుబడులకు అనువైన నగరంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది.
మీకు కావలసిన సమాచారం కోసం వాట్సాప్ లేదా కాల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి.