prashanthrealtor.in

+919666773472

రియల్ ఎస్టేట్ బూమ్.. త్వరలో పెరుగుతున్న నగరాలు.. తెలుగు రాష్ట్రాల్లో..

న్యూస్ అండ్ అప్‌డేట్స్
Real estate boom top cities grow faster in india -Prashanthrealtor

రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్స్:

దేశ అభివృద్ధి వేగవంతం కావడంతో కొత్త నగరాలు సృష్టి, అభివృద్ధి వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఇప్పటికే ఉన్న మెట్రోపాలిటన్ నగరాలతో పాటు కొత్త నగరాలు కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెరుగుదల చూపుతున్నాయి.

కొత్త పెట్టుబడి అవకాశాలు:

  • ముంబై, దిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ప్రాపర్టీ ధరలు అధికంగా ఉండడంతో, పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయ నగరాలను పరిశీలిస్తున్నారు.  
  • కొలియన్స్ ఇండియా నివేదిక ప్రకారం, భారత రియల్టీ మార్కెట్ 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2050 నాటికి 5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

ఫ్యూచర్ గ్రోత్ సిటీస్:

ఉత్తరాది:

  • అమృత్‌సర్, అయోధ్య, జైపూర్, కాన్పూర్, లక్నో, వారణాసి

తూర్పు:

  • పాట్నా, పూరీ

పశ్చిమ:

  • ద్వారక, షిరిడీ, నాగ్‌పూర్, సూరత్

దక్షిణ:

  • తిరుపతి, కొచ్చి, కోయంబత్తూర్, విశాఖపట్నం, ఇండోర్
ఈ నగరాల్లో ఆఫీసులు, గోదాములు, టూరిజం, లివింగ్ అండ్ సీనియర్ లివింగ్ ఆస్తులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.

“రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి కొత్త నగరాలను ఎంచుకోవడం మంచి యుక్తి. ఐతే, పెట్టుబడి పెట్టే ముందు ఆ ప్రాంతంలోని మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ మరియు ప్రాపర్టీ విలువలు పైన సమగ్ర పరిశోధన చేయడం అనివార్యం. ఇవే కాదు, ఫ్యూచర్ గ్రోత్ సిటీస్ (Future Growth Cities) లో డిజిటలైజేషన్, టూరిజం, ఆఫీస్ స్పేస్‌లు వంటి రంగాల్లో ఉన్న అవకాశాలను పరిశీలించడం మంచిది. తెలుగు రాష్ట్రాలలో విశాఖపట్నం, తిరుపతి, అమరావతి లాంటి నగరాలు త్వరలో మంచి పెట్టుబడి అవకాశాలు కలిగిన నగరాలుగా మారుతాయి.”

- రియల్ ఎస్టేట్ నిపుణుడు.

ముఖ్యాంశాలు:

  • కోయంబత్తూర్, ఇండోర్, కొచ్చి:  శాటిలైట్ ఆఫీస్ మార్కెట్లుగా ఎదుగుతున్నాయి.
  • జైపూర్, కాన్పూర్, లక్నో, నాగ్‌పూర్, పాట్నా, సూరత్: డిజిటలైజేషన్ పెరుగుతుందని భావిస్తున్నారు.
  • ఆధ్యాత్మిక నగరాలు: అమృత్‌సర్, అయోధ్య, ద్వారక, పూరి, షిర్డీ, తిరుపతి, వారణాసినగరాలు ఆధ్యాత్మిక పర్యాటకంలో అభివృద్ధి చెందుతాయి.

2050 నాటికి భారతదేశం ఎనిమిది మెగా-సిటీలతో పాటు దాదాపు 100 నగరాలను కలిగి ఉంటుంది. మెరుగైన కనెక్టివిటీ, తయారీ కార్యకలాపాలు, హైబ్రిడ్ వర్క్ మోడల్స్ చిన్న నగరాల్లో ఆఫీస్ స్పేస్‌లకు డిమాండ్‌ను పెంచుతున్నాయి.

తెలుగు రాష్ట్రాలు:

తిరుపతి:

తిరుమల వెంకన్న సన్నిధి కారణంగా టెంపుల్ టూరిజంలో తిరుపతి నగరం మరింత అభివృద్ధి చెందుతోంది.

విశాఖపట్నం:

నవ్యాంధ్రలో విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రస్తుత ప్రభుత్వం చూస్తోంది. ఇక్కడ రియల్టీ పెట్టుబడులు పెరగడం, అభివృద్ధి చెందుతున్నట్టు కనిపిస్తుంది.

అమరావతి:

కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం అమరావతిని పెట్టుబడులకు అనువైన నగరంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది.

Tag Post :
న్యూస్ అండ్ అప్‌డేట్స్
Share This :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *